24-07-2025 08:44:32 PM
ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలింపు..
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నరేందర్ గౌడ్(DSP Narender Goud) ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత నాలుగు రోజుల క్రితం శివంపేట్ మండల పరిధి మాగ్దూంపూర్ లో జరిగిన హత్య కేసులో సాభిల్ 22 బొరబండ అనే వ్యక్తి చనిపోయిన కేసులో ప్రధాన నిందితులను చాకచక్యంగా నలబై ఎనిమిది గంటల వ్యవధిలో పట్టుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఈ కేసులో ముఖ్యంగా సాభిల్ అనే యువకుడు మైనర్ అమ్మాయిని ప్రేమించడం జరిగింది.
ఇది తెలుసుకున్న అమ్మాయి సమీప బందువులు సాభీల్ ను వద్దని మందలించిన అతను వినక అమ్మాయిని నాకిచ్చి పెండ్లీ చేయాలని డిమాండ్ చేయడం లేకపోతే, అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో సమీప బంధువైన అప్సర్ ఇతని స్నేహితుడు సంతోష్ అనే వ్యక్తి కలసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన తూప్రాన్ సిఐ రంగ కృష్ణ, శివంపేట్ ఎస్ఐ, కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందిస్తూ త్వరలో రివార్డ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.