calender_icon.png 4 August, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా మహా సభలు విజయవంతం...

24-07-2025 08:50:09 PM

సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి కృతజ్ఞతలు..

జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి..

వనపర్తి (విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా తృతీయ మహాసభను విజయవంతం చేయడానికి కృషి చేసిన జర్నలిస్ట్ లు అందరికి నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవరావు, బి. రాజు లు  కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సభ నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకారం అందించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(MLA Tudi Megha Reddy)కి ధన్యవాదములు తెలిపారు. మహా సభలకు సహకరించడంతో పాటు వనపర్తి నియోజకవర్గ జర్నలిస్ట్ లకు వరాలు కురిపించడం సంతోషకరం అని అన్నారు. ప్రతి జర్నలిస్ట్ కు ఇంటి స్థలంతో పాటు, సొంత నిధులతో హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తానని హామీ ఇవ్వడం జర్నలిస్ట్ ల పట్ల తనకున్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మేఘా రెడ్డికి జర్నలిస్ట్ లందరం తోడుగా ఉంటాం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని అన్నారు.

విలువలతో కూడిన జర్నలిజం చేస్తామని అన్నారు.సభ విజయవంతానికి కృషి చేసిన జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్ట్ మిత్రులకు, యూనియన్ రాష్ట్ర నాయకులకు, సీనియర్ జర్నలిస్ట్ లకు, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు అయిన జిల్లా కార్యవర్గం నిరంతరం జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ద్యారపోగు మన్యం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, నర్సింహా రాజు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు విజయ్, బాలరాజు, టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ రాజ్, సిలమర్తి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.