calender_icon.png 4 August, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి

24-07-2025 08:41:11 PM

ఈ - పంచాయతీ ఆపరేటర్ల విజ్ఞప్తి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఈ - పంచాయతీ, కంప్యూటర్ ఆపరేటర్లకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా వేతనం చెల్లించాలని, గతంలో చెల్లించిన విధంగా 22,750 నెలకు వేతనం చెల్లించాలని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆపరేటర్లు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో(Additional Collector Lenin Vatsal Toppo)కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నెలకు వేతనం 19,500 రూపాయలు చెల్లిస్తున్నారని, వేతనం తగ్గించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.