17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇంటర్ ఫలితాల్లో తొర్రూరు విద్యార్థికి రాష్ట్రస్థాయి ర్యాంకు

23-04-2025 01:14 AM

గూడూరు, ఏప్రిల్ 22: (విజయ క్రాంతి) :ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో తొర్రూర్ కు చెందిన గడల రామ్ చరణ్ రాష్ట్రస్థాయిలో ౩ ర్యాంకు సాధించాడు. హనుమకొండ లోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రామ్ చరణ్ మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 440 మార్కులకు గడల రామ్ చరణ్ 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు.

అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో ప్రతిభా జూనియర్ కళాశాల చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయదుందుభి మ్రోగించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎం అంజలి అనే విద్యార్థిని 466 మార్కులు, బి శరణ్య మోలి 464 మార్కులు, జి కీర్తన 452 మార్కులు,      బి దీపిక, ఎం అభినవ్ అమృత 461 మార్కులు, బి హాసిని 460 మార్కులు సాధించారు. అదేవిధంగా సిఇసి విభాగంలో దియా మండల్ 469 మార్కులు సాధించారు.

కాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఆర్ వైష్ణవి 986 మార్కులు 983 మార్కులు ఎం సోనియా 981 మార్కులు బైపిసి విభాగంలో ప్రియాంక బౌమిక్ 967 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల డైరెక్టర్లు కేఎల్‌ఎన్ ఆచార్య,   కే సత్యనారాయణ రెడ్డి , శ్రవణ్ రావు, తిరుపతి తదితరులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ కళాశాల ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.