23-04-2025 01:15:54 AM
గులాబీ జెండా పోరు బాట.. అభివృద్ధి మాట
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
సిరిసిల్ల, ఏప్రిల్22 (విజయక్రాంతి): జల దృశ్యం నుంచి ఎల్కతుర్తి దాకా... గులాబీ జెండా పోరు బాట,అభివృద్ధి మాట. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించేది గులాబీ జెండా పార్టీ మాత్రమే అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికేళ్ళ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల వచ్చిన సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. గులాబీ జెండా భారీ బహిరంగ సభ కోసం జనం స్వచ్చందంగా తరలి వస్తున్నారని, ఎవరిని తరలించడం లేదని తెలిపారు.
ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి... తెచ్చి చూపించి తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామీగా నిలిపిన ఘనత తమ అధినేత కెసిఆర్ కు దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు,వేములవాడ నిజాయకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు గారు, మాజీ జేపీ చైర్మెన్ అరుణ రాఘవరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ గారు, మాజీ మునిసిపల్ చైర్మన్ కళ చక్రపాణి గారు, రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డి గారు, మాజీ జేపీ వైస్ చైర్మన్ సిద్దం వేణు,పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.