07-05-2025 08:54:08 PM
కలెక్టర్ కు బిజెపి నాయకులకు వినతి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక సర్వే చేసి, కార్డెన్ సెర్చ్ నిర్వహించి జిల్లాలో ఉన్న రోహింగ్యాలను అరెస్ట్ చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా పాకిస్థాన్ వారిని దేశం నుండి వెళ్ళిపోవాలని కేంద్ర ఆదేశించడం జరిగిందన్నారు.
ఆ యొక్క ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, అదే విధంగా జిల్లాలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ వారిని, రోహింగ్యాలను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాల విషయమై ప్రత్యేక సర్వే చేసి, కార్డెన్ సెర్చ్ నిర్వహించి అరెస్ట్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ తరపున కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, కుంట లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, ఆకుల భరత్ కుమార్, రాజు పటేల్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.