calender_icon.png 8 May, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్కులు ఇస్తలేరు..

07-05-2025 08:48:00 PM

చోట లీడర్ల ఇష్ట రాజ్యం..

ఇంటి పేరు సేమ్ ఉంటే వేరే వారికి చెక్కులు..

లబో దిబోమంటున్న బాధితులు..

పార్టీకి చెడ్డ పేరు చేస్తున్న గల్లి లీడర్లు.. 

జుక్కల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యవసర సమయాల్లో ఎవరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించి ఆదుకునేందుకు ఎప్పటినుంచో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రోగుల బంధుమిత్రులు దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ కింద కొన్ని డబ్బులు చెక్కుల రూపంలో వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా జుక్కల్ మండలంలో చోటా మోటా లీడర్లు, గల్లీ లీడర్లు తమ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఏమీ లేకున్నప్పటికీ మేమే ఎమ్మెల్యేలమంటూ చెప్పుకుంటూ పబ్బం గడుపుకునే లీడర్లు ఎక్కువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇదే విషయమై జుక్కల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారని, వేరే పార్టీలకు సంబంధించిన వారికి చెక్కులు ఇవ్వడం లేదంటూ లబోదిబోమంటున్నారు. ఇలాంటి సంఘటనలు మండలంలోని చాలా గ్రామంలో జరిగినప్పటికీ ప్రస్తుతం కేంరాజు కాల్చాలి, మమదాబాద్, ఖండేబల్లూర్, బస్వాపూర్ తదితర గ్రామాల్లో చెక్కులు ఇవ్వడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులు వచ్చినవారికి ఇవ్వకపోగా మరికొందరికి దరఖాస్తులు చేసుకున్న వారు ఆరు నుంచి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ వారికి చెక్కులు వచ్చాయా లేదా అని తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

నాయకులకు అడిగితే రేపు మాకు అంటూ కాలం వెళ్ళదీస్తున్నారని పేర్కొంటున్నారు. ఖండేబల్లూరు గ్రామంలో ఒకరికి బదులుగా మరొకరికి చెక్కు ఇచ్చినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. పొరపాటున జరిగిందా లేకుంటే కావాలనే నాయకులు ఈ విధంగా చేస్తున్నారా అనేది తెలియాల్సిన విషయం. ఈ గ్రామంలో చెక్కు ట్రాన్స్ఫర్ కావడానికి కారణం ఇంటి పేర్లు యధావిధిగా ఇద్దరిదీ ఉండడంతో ఈ విధంగా జరిగినట్లు కూడా చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నది ఒకరు చెక్కు ఇచ్చింది మరొకరికి అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇది కాకుండా మరొక వ్యక్తి కూడా చెక్కు వచ్చి 20 రోజులు గడిచిన ఎప్పటి వరకు రేపు మాకు అంటూ ఇవ్వడం లేదంటూ ఆయన ఆవేదన వెళ్లగక్కారు.

ఇంకొకరికి చెక్కు వచ్చి కాలంచెల్లిన గాని ఇప్పటివరకు చెక్కు అందించకపోవడం కూడా చెప్పుకోదగ్గ అంశం. కేమ్రాజ్ వెళ్లాలి గ్రామంలో అఖిల్ అనే యువకుడికి గత కొన్ని నెలల పాటు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషయమై తండ్రి అంజన్న సీఎంఆర్ఎఫ్ కింద క్యాంపు ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. జనవరి ఆరో తారీఖున దరఖాస్తు అందించామని ఆయన చెబుతున్నారు. అయితే తన పేరు మీద చెక్కు వచ్చినట్లు తన మొబైల్ కు ఎస్ఎంఎస్ వచ్చిందని బాధితుడు అఖిల్ విజయ క్రాంతితో తెలపడం జరిగింది. కానీ అదే గ్రామానికి చెందిన ఒక నాయకుడు చెక్కు ఇవ్వకుండా సతాయింపులకు పాల్పడి చివరికి చెప్పు కాలపరిమితి దాటిపోయిందని బాధితుడు వాపోయాడు. చెక్కులు వచ్చిన మూడు నెలల్లో డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది అయితే మూడు నెలల వరకు అసలు చెక్కు ఇవ్వలేదని ఆయన చెప్పడం బాధాకరం.

తనకు ట్రీట్మెంట్ కోసం ఆరు లక్షల వరకు ఖర్చు అయిందని అయితే హాస్పిటల్ లో సిఎంఆర్ఎఫ్ కోసం రెండున్నర లక్షల ఫైనల్ బిల్లును రాసి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. చెక్కులు వస్తున్నాయి కానీ డేట్లు అయిపోయేంతవరకు కూడా చెక్కులు ఇవ్వకపోవడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తామే ఎమ్మెల్యేలుగా చెప్పుకుని తిరిగే గల్లీ లీడర్లు ఈ విధంగా చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలుసొ.. తెలియదో తమకు తెలియదని కిందిస్థాయి నాయకులు ఈ విధంగా చేయడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జుక్కల్ ఎమ్మెల్యే ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని అర్హులకు న్యాయం జరిగే విధంగా చూస్తారని ఆశిస్తున్నట్లు వారు కోరుతున్నారు.