6 July, 2026 | 3:22 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం

24-09-2024 12:40 AM

ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం ఉంటుందని ఆదివాసీ కాం గ్రెస్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బెల్లయ్యనాయ క్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కో హామీని అమలు చేస్తున్నారని తెలిపారు.

నూతన పీసీసీ చీఫ్ మహేశ్‌కు మార్ గౌడ్ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తా రని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచి త విద్యుత్, ఆరోగ్య పరిమితి రూ. 10 లక్షల వరకు పెంపు తదితర అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదివాసీ కాం గ్రెస్ నేతృత్వంలో సన్మానించాలని ఈ సమవేశంలో నిర్ణయం తీసుకున్నారు.