18-05-2025 12:00:00 AM
పాలగారెల గురించి 15వ శతాబ్దపు పాకశాస్త్ర గ్రంథం దీని గురించి రాయబడి ఉందని పండితులు చెబుతున్నారు. పొట్టు తీసిన మినప్పుని పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి.. పైపైన దంచిన మిరియాల పొడిని తగుపాళ్లు నేతిలో గారెలు చేయాలి. చక్కెర వేసి చిక్కగా కాచిన పాలలో ఈ గారెల్ని నానబెట్టాలి. ఇవి మెత్తగా అయ్యేలా నానిన తర్వాత తింటే కమ్మగా ఉంటాయి.
చక్కెర లేతపాకం పట్టి అందులో కూడా ఈ గారెల్ని నానబెట్టి తినొచ్చు. ఇది జాంగ్రీ వంటకానికి పూర్వరూపం. పాల విరుగుడుని గారె ఆకారంలో చేసి పాలలో నానబెడితే.. రసమలాయ్ తయారవుతుంది. ఇది బెంగాలీ స్వీట్. ప్రస్తుతం మనకు ఆధునికంగా అలవాటైన స్వీట్ ఇది.