15 April, 2026 | 12:30 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

15 స్థానాల్లో పోటీ చేస్తున్నాం

07-02-2026 12:28 AM

కొత్తగూడెం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు

ఆర్‌ఎల్‌డీ నేతలు

కొత్తగూడెం/అశ్వరావుపేట, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) 15 స్థానాల్లో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ కపిలవాయి, జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి, కట్టా సతీష్ తదితరులు పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెం పార్టీ కార్యా లయంలో వారు విలేకరల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ ఆర్‌ఎల్‌డీకి ఎన్నికల గుర్తుగా ఫుట్‌బాల్‌ను ఎన్నికల కమిషన్ కేటాయించిందని, కొత్తగూడెంలో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు.

మా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆర్‌ఎల్‌డీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో బీఆర్‌ఎస్‌ను మించిపోయిందని దిలీప్ కుమార్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అసమర్ధ ముఖ్యమంత్రి అని, తన సుదీర్ఘ అధికార, రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సంక్షేమ పథ కాలకు ఒక్క రూపాయి కూడా లేదని వచ్చే డబ్బు అంతా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వాదే అని, ఈ ఎన్నికల్లో ప్రజలు రేవంత్‌రెడ్డి అహంకారంపై దెబ్బకొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

సింగరేణి సంస్థను మూసి వేయాలని తద్వా రా పర్యావరణం, అడవులు, వన్య ప్రాణులు కాపాడబడతాయని లేకపోతే కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం రాజస్థాన్ ఏడారి లాగా మారతాయన్నారు. సంస్థను నడపదలుచుకుంటే 51 శాతం వా టా సింగరేణి కార్మికులకు ఇవ్వాలని మిగిలిన 49శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావే శంలో ఆర్‌ఎల్డీ యువత అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ గౌర బీర ప్ప, ఆర్‌ఎల్డీ రాష్ట్ర ట్రెజరర్ గిరి కుండే, క ట్టా సతీష్, జిల్లా అధ్యోఉలు ప్రసాద్ యుగంపూపడి స్టేట్ జనరల్ సెక్రటరీ తదితరులున్నారు.