17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అరుణోదయ మహాసభను జయప్రదం చేయాలి

07-02-2026 12:27 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 6: ఈనెల 20న మండల కేంద్రం అర్వపల్లిలో జరిగే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 9వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి,కాంచనపల్లి సైదులు కోరారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీడిత ప్రజల పక్షాన గళం విప్పుతూ,దోపిడీ,పీడన,అసమానత,అణిచివేతలపై తమ కళారూపాలను ఆయుధంగా ఎక్కుపెట్టి అరుణోదయ సమాఖ్య ముందుకు వెళుతుందని అన్నారు.

ఈ నెల 20న జరిగే మహాసభకు ప్రజా కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర నాయకులు తడకమల్ల సంజీవ్,జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర ఉమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లి వెంకన్న,కోశాధికారి నాగేష్,నర్సిరెడ్డి పాల్గొన్నారు.