09-08-2025 01:02:25 PM
మంథని,(విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దాసరి శివను టి పిసిసి ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) శనివారం పరామర్శించారు. శివకు మెరుగైన వైద్యం కోసం శ్రీనుబాబు కరీంనగర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. అధైర్య పడద్దని, తొందర్లోనే కోలుకొని ఆరోగ్యంగా ఉంటావని శివకు శ్రీనుబాబు ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు, స్థానిక టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కల్వల శంకర్, నాయకులు అనవేన రాయమల్లు, దుర్కి కొమురయ్య, బొంతల రమేష్, జెట్టవేన రంజిత్, మాతంగి కుమార్, ఇల్లందుల సంజీవ్, ఖాజపాష, నేదురు సురేష్, బుర్ర గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.