31-01-2026 12:00:00 AM
వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ కుమార్
మేడిపల్లి,జనవరి 30 (విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస ఇండ్ల దొంగతనాల కేసులో ముగ్గు రు నిందితులను, గోల్ రిసీవర్ ను అరెస్టు చేశామని సిసిఎస్ అండ్ మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో డిసిపి సురేష్ కుమార్ దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. ఢిల్లీకి చెందిన మా దేవ్ ఝూ(ఎ1) పవన్ గుప్తా (ఎ2) కాన్పూర్‌కు చెందిన మంగళ్ సింగ్ (ఎ3) లు బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రెండు లక్షల నగదు దోచుకుని పోయారని తెలిపా రు.
పోలీసులు సాంకేతిక ఆధారాలు,సి సి టీవీ ఫుటేజ్ ఆధారంగా నేరాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్టు చేశా మని, వీరితో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసిన బీహార్‌కు చెందిన సీరామ్ సవ్ బీరేంద్ర (ఎ4) ను కూడా ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకువచ్చి, ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరి నిందితులను బీహార్ నుంచి తీసుకు వస్తున్నట్టు డిసిపి తెలిపారు.
నిందితులు గతం లో నల్లగొండ, జనగాం పోలీస్ స్టేషన్ లో పలుచోరీల కేసుల్లో నిందితులుగా ఉ న్నారని, నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రెండు లక్షల నాలుగువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును చేదించిన పోలీస్ సిబ్బందికి డిసిపి సురేష్ కుమార్ అభినందించి రివార్డులు అందించారు. ఈ కార్యక్ర మంలో క్రైమ్ డిసిపి నాగలక్ష్మి, సిఐ గోవిందరెడ్డి, ఎస్‌ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.