18 August, 2026 | 1:16 AM

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు

18-08-2026 12:00 AM

నాగోల్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నాగోల్ పోలీ స్స్టేషన్లో నమోదైన క్రైం నంబర్ 405/ 2025 కేసులో బీఎన్‌ఎస్ సెక్షన్ 78, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద నిందితుడు ఉప్పు రాకేష్ (24)పై కేసు నమో దైంది. విచారణ అనంతరం నిందితుడిని కో ర్టు దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది.

అలాగే బాధితురాలికి రూ.50,000 పరిహా రం అందించాలని ఆదేశించింది. ఈ కేసులో నాగోల్ ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ వా దనలు వినిపించారు. కేసు విచారణలో నా గోల్ పోలీస్స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాజు, సమన్స్ కానిస్టేబుల్ వెంకటేష్, ఏఎస్త్స్ర పి. శోభ సహకరించారు.