17-12-2025 12:00:00 AM
ప్రశాంత ఎన్నికల కోసం రాత్రింబవళ్లు విధుల్లో పోలీసులు
ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ చివరి ఘట్టం మూడవ విడత ఎన్నికలు జిల్లాలో పూర్తిగా ప్రశాం తంగా, నిర్భయంగా, పారదర్శకంగా జరి గేలా పోలీసుశాఖ అత్యంత పటిష్టమైన భద్ర తా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, తెలిపారు.మొదటి, రెండవ విడతల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగియడంలో పోలీసు అధికారులు, సిబ్బంది ప్రదర్శించిన క్రమశిక్షణ, అప్రమ త్తత ప్రశంసనీయమని పేర్కొన్నారు.
అదే స్థాయిలో మూడవ విడతలో పెబ్బేర్ పాన గల్ వీపనగండ్ల చిన్నంబావి శ్రీరంగాపూర్ మండలాలలో మొత్తం 87 గ్రామపంచా యతీలకు గాను 06 గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. మిగిత మొత్తం 81 గ్రామపంచాయతీలకు 1300 మంది పోలీసు అధికారులు సిబ్బందిచే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరు బాధ్యతతో విధులు నిర్వహించి ఎన్నికల విజయానికి తోడ్పడాలని ఆమె కోరారు.