calender_icon.png 7 May, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు

03-05-2025 12:00:00 AM

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే2 (విజయ క్రాంతి): నీట్ (యూజీ) పరీక్ష సందర్భంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.

ఈనెల 4న జిల్లా కేం ద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో జరగనున్న నీట్ పరీక్ష సందర్భంగా  విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో  పరీక్ష రాసే విధంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పొందుపరిచిన నియమ, నిబంధనలు పాటించి అధికారులకు సహకరిం చాలని కోరారు. విద్యార్థులకు ఏమైనా సమస్య ఎదురైతే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.