03-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే2( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ బాలికల క్రీడా పాఠశాలలో శుక్రవారం అకాడమిక్ మానిటరి అధికారి ఉద్దేవ్ స్టిమ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీడబ్ల్యూపి ఇంటెరిక్స్ వారి ఆర్థిక సహకారంతో విభా, సివైడిఎ సంస్థల ఆధ్వర్యంలో ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జంగు, సంస్థ సభ్యులు నరేష్, బాలకృష్ణ, రవీందర్ పాల్గొన్నారు.