calender_icon.png 30 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రోఫీ, పతకాలను వెంట తీసుకెళ్లిన పీసీబీ చీఫ్

30-09-2025 12:58:51 AM

  1. ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ
  2. నఖ్వీ ట్రోఫీ, పతకాలు అప్పగించాలని డిమాండ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైన ల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియాకు వింత అనుభవం ఎదురైంది. విజేతగా నిలిచిన జట్టుకు అతిథులు అందించాల్సిన ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధినేత మొహ్‌సిన్ నఖ్వీ తన తీసుకెళ్లడం విమర్శలకు దారితీసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఒక పాకిస్థాన్ ప్రతినిధి నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీంఇండియా నిరాకరించింది.

దీంతో అవార్డుల ప్రదానోత్సవం గం టకు పైగా ఆలస్యమైంది. వేదికపై అవమా నం ఎదురవుతుందని గ్రహించిన నఖ్వీ, దురుద్దేశంతో ట్రోఫీని, మెడల్స్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. అయినప్పటికీ భారత క్రికెటర్ల ఉత్సాహం తగ్గలేదు. కెప్టెన్ సూర్యకు మార్ యాదవ్ తన జట్టును వేదికపైకి నడిపించి, లేని ట్రోఫీని బృందమంతా పట్టు కున్నట్లుగా సంకేతాలు చేస్తూ అభిమానుల ను అలరించాడు.

జట్టు సభ్యులే తనకు ట్రో ఫీలు అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. మ రోవైపు నఖ్వీ వైఖరిపై బీసీసీఐ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. నఖ్వీ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ట్రోఫీని మెడల్స్‌ను వెంటనే భారత్‌కు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, నవంబర్‌లో జరగనున్న ఐసీసీ సమావేశంలో నఖ్వీ వైఖరిపై నిరసన తెలియజేస్తామని బీసీసీఐ నిర్ణయించింది.