21-08-2025 08:25:05 PM
ఘట్కేసర్: ఘట్కేసర్ పట్టణంలోని ప్రైమ్ ల్యాండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(Prime Land Plot Owners Welfare Association) నూతన కమిటీని ఎన్నుకున్నారు. గురువారం ప్రైమ్ ల్యాండ్ వెంచర్ లోని గణపతి ఆలయంలో ప్లాట్ ఓనర్స్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రైమ్ ల్యాండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొమ్మిడి జగన్ మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా సాల్వేరు రాజేష్, ఉపాధ్యక్షులుగా ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి, మన్నె నందుమూర్తి, సోమసాని రమేష్, దంతాల అనిల్ కుమార్, కోశాధికారిగా మామిళ్ళ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, కాగు హరికృష్ణ, సెక్రటరీగా తేలు కుంట్ల శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జి. విజయ్ కుమార్, ఎం. రవీందర్, సలహాదారులుగా అబ్బసాని యాదగిరియాదవ్, కేశవపట్నం ఆంజనేయులు, బర్ల దేవేందర్ ముదిరాజ్, పి. శశిధరన్, ఎం. ధనరాజ్ (అడ్వకేట్) ఎన్నికయ్యారు.