27 August, 2026 | 5:26 AM

రైళ్ల సమయపాలన పాటించాలి

21-05-2024 02:22 AM

దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రైళ్ల రాకపోకలు, భద్రత విషయంలో ముందస్తు ప్రణాళికలు అత్యవసరమని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ స్పష్టం చేశారు. లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, స్టేషన్ మాస్టర్లు, పర్మినెంట్ వే మెయింటనెన్స్, రన్నింగ్ సిబ్బందికి క్రమం తప్పకుండా భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు. సోమవారం  సికింద్రాబాద్ రైల్ నిలయంలో భద్రత, సమయ పాలనపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి భద్రత, రైళ్ల రాకపోకలపై పరిశీలించాలన్నారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ పాలనపై మరింత దృష్టి సారించాలని అన్నారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి పొగను గుర్తించే సాధనాలు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. రైళ్ల వేగం పెంచేందుకు తీసుకోవాలల్సిన చర్యలపైనా చర్చించారు. సమీక్షలో అదనపు జీఎం పాల్గొన్నారు.