calender_icon.png 21 October, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు రోజులు కేరళలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

21-10-2025 11:50:47 AM

తిరువనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికార పర్యటన కోసం కేరళ మంగళవారం వెళ్తన్నారు. ఆమె కేరళ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. అందుకోసం రాష్ట్ర రాజధానిలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుండి రాష్ట్రపతి వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 3 గంటల నుండి నగరం అంతటా ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు అమలులో ఉంటాయని వర్గాలు తెలిపాయి. ముర్మును తీసుకెళ్తున్న స్పెషల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) విమానం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఐఎఎఫ్ ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ ఎన్‌క్లేవ్‌ను చేరుకోగానే కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేర్కర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ ఆమెకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి అక్కడ రాత్రి బస చేస్తారు.

బుధవారం పతనంతిట్ట జిల్లాలోని శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శనం చేసుకొని ఆర్తి కోసం సందర్శిస్తార. గురువారం రాష్టపతి ముర్ము మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరణ, వర్కాలలోని శివగిరి మఠంలో శ్రీనారాయణ గురు మహాసమాధి శత జయంతిని ఆమె ప్రారంభించనున్నారు. తరువాత, పాలాలోని సెయింట్ థామస్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల వేడుకలను ప్రారంభించేందుకు ముర్ము కొట్టాయంకు బయలుదేరుతారు. శుక్రవారం (అక్టోబర్ 24, 2025) ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించి, ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరువనంతపురంలో, శంఖుముఘం ఎయిర్ ఫోర్స్ స్టేషన్-రాజ్ భవన్ రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ను పోలీసులు నిషేధించారు. ట్రాఫిక్ అంతరాయాల గురించి నగర పోలీసులు పౌరులను అప్రమత్తం చేశారు.