calender_icon.png 21 October, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి రోజు బాంబు పేల్చిన జీవన్

21-10-2025 10:28:18 AM

ఈ సారి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పై...

కరీంనగర్,(విజయక్రాంతి): మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ.జీవన్ రెడ్డి మరో మారు పొలిటికల్ బాంబ్ పేల్చారు. వలస దారులను ప్రొత్సహిస్తూ అసలు సిసలైన పార్టీ శ్రేణులను విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు. మానసిక హింసకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ లు కారణమంటూ బాంబు పేల్చారు. దీపావళి పండుగ రోజున మంత్రి ముందు అధిష్టానం తీరును ఏకిపారేశారు. పట్టదారులమైన తమను విస్మరించి కౌలు దారులను పెంచిపోషిస్తున్న తీరు సరికాదంటూ నిలదీశారు. 

మీరు మమ్మల్ని హలాల్ చేస్తున్నారు. దీనికన్నా ఒకే సారి జట్కా ఇవ్వాలని మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్  మరో మారు పార్టీ లో చర్చకు దారి తీస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. అయితే ఇటీవల స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని డాక్టర్ ↑ సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. 

అయితే వలస వాదులను ప్రొత్సహించడం ఎందుకు..? ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం మంచిది కాదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొదటి నుండి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ సంజయ్ కారణంగా మారిన సమీకరణాల నేపథ్యంలో అప్పట్లోనే జీవన్ రెడ్డి కినుక వహించారు. దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపడంతో సద్దుమణిగింది  అయితే బీర్పూర్ దేవాలయ చైర్మన్ గా తాను సూచించిన బారికి కాకుండా ఎమ్మెల్యే  సూచించిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం మరో మారు కట్టలు తెంచుకుంది.