21-10-2025 11:07:06 AM
హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతినిత్యం ప్రజల రక్షణ కోసం, కర్తవ్యదీక్షలో ప్రాణ త్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. గోషామహల్‌లోని పోలీసు అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పోలీసు జెండా దినోత్సవ కవాతులో పాల్గొన్న రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పోలీసు అంటే సమాజానికి నమ్మకం.. భరోసా.. అని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతన్నారని పేర్కొన్నారు.
మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 1959 అక్టోబర్ 21న భారత్, చైనా సరిహద్దుల్లో 10 మంది జవాన్లు వీరమరణం పొందినందుకు ప్రతి ఏటా ఈరోజున పోలీసు అమరవీరుల సంస్మరించుకుంటున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీరమరణం పొందారని, అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటిస్థలం కేటాయిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్ పేరుతో బృందం నియమించామని, సైబర్, డిజిటల్, మార్ఫిగ్, డ్రగ్స్ లో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలకు దాంతోనే సమాధానం చెబుతున్నామని, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని కొనియాడారు. ఇటీవల అనేకమంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారని, మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
అనేక విభాగాలకు మహిళా ఐపీఎస్ లు సారథ్యం వహిస్తున్నారని, పోలీసు డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిదని సీఎం తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితం త్యాగం చేస్తున్నారని, పోలీసుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పనిచేయాలని కోరామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక 16 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. పోలీసులకు ఏదైనా జరిగితే దేశంలోనే అత్యధిక పరిహారం ఇస్తున్నామని, తమ పిల్లలకు మంచిరేవులలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. పోలీసులు తమ విధినిర్వహణలో పారదర్శకత, నైతిక విలువలు పాటించాలని, ఇలాగే పనిచేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుతున్నట్లు రేవంత్ రెడ్