27 August, 2026 | 2:42 AM

పుట్టినరోజున టైటిల్ గ్లింప్స్

27-08-2026 12:25 AM

కింగ్ నాగార్జున(Actor Nagarjuna Akkineni) ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ‘కింగ్100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్‌డేట్ పంచుకుంది చిత్రబృందం. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించిన సీనియర్ హీరోయిన్ టబు.. చాలా కాలం తర్వాత మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.