25-07-2025 11:13:50 PM
ఖమ్మం,(విజయక్రాంతి): రేపు తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం ఖమ్మంలోని టీటీడీసీలో నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా టీజేఏ అధ్యక్షులు గంగారపు నాగస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి టీజీఏ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతారని, అదేవిధంగా అన్ని జిల్లాలలోని టీజీఏ నాయకులు హాజరవుతారని ఆయన తెలిపారు. సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని టీజీఏ సభ్యులు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.