calender_icon.png 26 July, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాల తనిఖీ

26-07-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, 25 జూలై (విజయ క్రాంతి): మండలంలోని బలగల పరిధిలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియ ల్ పాఠశాల కాగజ్‌నగర్ ఎంపీడీవో కోట ప్రసాద్  తనిఖీ చేశారు.  ఉ పాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టి క పరిశీలించి, వంట సరుకులు, కూరగాయలు, వంటగది, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు.

నాణ్యత ప్రమాణాలతో కూడిన నిత్యావసర సరుకులు, తాజా కూరగాయలు వస్తున్నాయ అని  సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు. మంచినీటి ట్యాంకును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూమీ ఫాతిమా, ఏపీవో చంద్రశేఖర్ , కార్యదర్శి హరీష్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.