07-07-2025 01:37:56 AM
కరీంనగర్, జూలై 6 (విజయక్రాంతి): తొలి ఏకాదశి పండుగ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వెనుకబడిన తరగతుల, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభా కాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులకు సంబంధించిన పలు సమస్యలను మంత్రికి విన్నవించారు.
ఇట్టి కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, జిల్లా నాయకులు మల్క రాజేశ్వరరావు, వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం రా ష్ట్ర కార్యదర్శి మచ్చేందర్, జిల్లా అధ్యక్షులు బోనాల రవి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సురేష్, తదితరులుపాల్గొన్నారు.