9 April, 2026 | 6:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

10 నుంచి టీఎన్‌జీవో క్రీడోత్సవాలు

08-12-2024 01:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 10 నుంచి 15 వరకూ హైదరాబాద్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం ముజీబ్ హుస్సేనీ తెలిపారు. ఈసందర్భంగా టీఎన్‌జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో శనివారం సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సందర్బంగాముజీబ్ మాట్లాడుతూ.. జిల్లా సంఘం ఆధ్వర్యంలో పదేళ్లుగా ఉద్యోగుల క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ట్టు తెలిపారు.

ఈ పోటీల్లో ఉద్యోగులందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ పోటీలలో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు కూడా ఉంటాయన్నారు. దోమలగూడ గగన్ మహల్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి.. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ చైర్మన్ ఫయీమ్ ఖురేషీ, రాజ్యసభ ఎంపీ ఎం అనిల్‌కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ అనుదీప్, టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ హాజరవుతారని అన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు వెంక టేశ్వర్లు, కొండల్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, ముహమ్మద్ నజీర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, నగర అధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, సహాధ్యక్షుడు రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, నరేశ్, సభ్యులు.. గీత, వైదిక్ శస్త్ర, జిల్లా ఏపీఆర్‌ఓ మొహమ్మద్ వహీద్, మహమ్మద్ ముస్తఫా షరీఫ్ తదితరులు పాల్గొన్నా రు.