సమయపాలన పాటించకుంటే చర్యలు
20-08-2026 12:21 AM
కొత్తూరు పీహెస్‌సీని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి
షాద్‌నగర్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కొత్తూరులోని పీహెచ్‌సీని అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విభాగాన్ని తిరిగి పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రి నిర్వహణ తీరుపై ఆరా తీశారు.
అనంతరం ఓపి సేవలు, ఐపీ సేవలు, ల్యాబ్, ఐపీ రి కార్డ్స్, మెడికల్ ఫార్మసీని పరిశీలించి పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప త్రికి టైంకి రాని సిబ్బందిపై సీరియస్ అ య్యారు. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, పేషెంట్లకు వైద్య సేవల విషయంలో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






