04-11-2025 01:17:49 AM
							రష్మిక మందన్నా వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఈ నెల 7న విడుదల కానుంది. దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. బలమైన భావోద్వేగాలతో నిండిన ఈ కథ తన మనసుకు హత్తుకుందని, ఈ సినిమా తనకు రష్మిక ఎంతో ప్రత్యేకమైందని చెప్తోంది. ఇదిలా ఉంటే, రష్మిక తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. అదే ‘మైసా’.
ఈ సినిమాలో గోండ్ గిరిజన మహిళగా కనిపించనుంది నేషనల్ క్రష్. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల చాలా సినిమాలకు తనదైన స్వరాలతో ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్న జాక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక ‘పుష్ప2’లో ప్రతినాయకుడిగా కనిపించిన తారక్ ఈ సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మేకర్స్ ప్రారంభించారు.
కేరళలోని అథిరప్పిల్లీలో ఈ చిత్రీకరణ మొదలయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్.. రెంటింటినీ సమాంతరంగా పూర్తి చేస్తూ, అతి త్వరగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.