calender_icon.png 4 November, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లికల్‌లో భారీ చోరీ

04-11-2025 02:07:18 PM

లక్షల విలువైన మేకలు మాయం

కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు కుటుంబాలకు చెందిన పశువుల పాకలే లక్ష్యంగా చేసుకొని, సుమారు 28 మేకలను ఎత్తుకెళ్లారు.  గ్రామానికి చెందిన వసంత సత్యనారాయణకు చెందిన 26, అదే గ్రామానికి చెందిన బాతుక నర్సింహులుకు చెందిన రెండు మేకపోతులను దొంగలు ఎత్తుకెళ్లారు. రోజూలాగే మంగళవారం ఉదయం తమ జీవాలను చూసుకునేందుకు పశువుల పాకను చుసిన బాధితులు షాక్ కి గురయ్యారు. తమ జీవనాధారమైన మేకలు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.