04-11-2025 02:01:11 PM
							ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా అడవుల్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. మంగళవారం జిల్లాలోని గోంగూర- కంచాల అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించి ధ్వంసం చేశారు. ఆ ప్రాంతం నుంచి 17 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, ఆయుధ తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు డీఆర్జీ వ్యూహాత్మక చర్యతో మావోయిస్టుల నెట్ వర్క్ కు ఎదురుదెబ్బ తగిలిందని ఆయన పేర్కొన్నారు.