04-11-2025 02:11:05 PM
							కోదాడ: 2025-26 అకాడమీలో భాగంగా ఎస్జీఎఫ్ఐ (School Games Federation of India) ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాల బాలికల షూటింగ్ సెలక్షన్ ఈనెల 8వ తారీఖున కోదాడ పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లుగా సూర్యాపేట జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్ 14, అండర్ 17సంవత్సరాల లోపు బాల బాలికలు ఎవరైనా షూటింగ్ పై ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అండర్ 14కి 01.01.2012 తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులని, అండర్ 17కి 01.01.2009 తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. క్రీడలో పాల్గొనబోయే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాల నుండి బోనఫైడ్ ఆధార్ కార్డ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని, పూర్తి సమాచారం కొరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్జీఎఫ్ కోచ్ మేడ సత్తి అంజయ్య 9030033319 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.