calender_icon.png 4 November, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి వినతి పత్రం

04-11-2025 01:38:20 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా గల మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసి పెద్ది శ్రీదర్ రాజ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా  ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మెంట్ పథకాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య  20 సంవత్సరాలుగా పోరాడి ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించడం వల్ల ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

ఈ పథకం వల్ల లక్షలాదిమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఇలాంటి పథకానికి గత ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఈ పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది. బడుగు బలహీన వర్గాలు ఈ స్కీము వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయద్దని, నిధులు రాక కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవైపు రియంబర్స్మెంట్ బకాయిలు రాక కళాశాలలో ఉన్నటువంటి బోధనా సిబ్బందికి జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో కళాశాల యజమాన్యాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా కళాశాలలు మూతపడ్డాయి. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.