calender_icon.png 25 January, 2026 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముడతలు తగ్గాలంటే!

28-12-2024 12:00:00 AM

చలికాలంలో చర్మం చాలా డల్‌గా మారుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సీజన్‌లో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దీనికోసం కొందరు ఖరీదైన కాస్మొటిక్స్‌ను కొంటుంటారు. అలా కాకుండా ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణకు కార్న్ ఫ్లోర్‌ను ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. కార్న్‌ఫ్లోర్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు పోషణను కూడా అందిస్తుంది. కార్న్‌ఫ్లోర్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

చర్మం మెరుస్తుంది: కార్న్‌ఫ్లోర్ పిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. వారానికి రెండు, మూడు సార్లు కార్న్‌ఫ్లోర్ ఫేస్ ప్యాక్ వాడితే ముఖం మెరిసిపోతుంది. 

మృత కణాలను తొలగిస్తుంది: కార్న్‌ఫ్లోర్ స్క్రబ్‌లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు కార్న్‌ఫ్లోర్‌తో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగించాలి. 

ముడతలను తగ్గిస్తుంది: కార్న్‌ఫ్లోర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే ముడతలు తగ్గాలంటే కార్న్‌ఫ్లోర్ ఫేస్ ప్యాక్ వాడాలి. దీన్ని ఉపయోగించడం వల్ల పిగ్మెంటేషన్‌తో పాటు టానింగ్ సమస్య తగ్గిపోతుంది. 

ఫేస్ ప్యాక్ తయారీ: కార్న్‌ఫ్లోర్‌తో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌లో పచ్చిపాలు పోసి బాగా కలపాలి. దాంట్లోనే తేనె, రోజ్ వాటర్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పేస్ట్‌లా తయారవుతుంది. ఈ పేస్ట్‌ని ముఖం, మెడపై అప్లు చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి.