28-12-2024 12:00:00 AM
తల్లిగా మారడం అనేది స్త్రీ జీవితంలో కీలకమైంది. అయితే తల్లి అయిన తర్వాత శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కడుపుపై సాగిన గుర్తులు. స్ట్రెచ్ మార్క్స్ తీవ్ర ప్రభావం చూపుతాయి. బరువు అకస్మాత్తుగా పెరిగినప్పుడు, తగ్గినప్పుడు చర్మంపై మార్కులు కనిపిస్తాయి. దీన్ని తొలగించేందుకు ఖరీదైన క్రీములు వాడేవారూ ఉన్నారు. కానీ దీనికి పరిష్కారం మన వంటగదిలోనే ఉంది.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె జుట్టు, చర్మానికి చర్మ సమస్యలను నివారించవచ్చు. అదేవిధంగా బాదం నూనె కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను స్ట్రెచ్ మార్క్స్ పై మసాజ్ చేయండి. బాదం నూనె, కొబ్బరి నూనెను మిక్స్ చేసి అప్లయ్ చేయడం వల్ల కూడా చాలా మేలు చేస్తుంది. దీర్ఘకాలిక ఉపయోగంతో సాగిన గుర్తులను తొలగించుకోవచ్చు.
కలబంద
అన్ని చర్మ సమస్యలకు పరిష్కారం కలబందలో ఉంది. కలబందను ఉపయోగించడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందు లో విటమిన్ ఎ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ప్రతిరోజు అలోవెరా జెల్ అప్లయ్ చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి. అయితే ఇది ప్రతిరోజు చేయాలి.
గుడ్డులోని తెల్లసొన
గుడ్డులోని తెల్లసొన చర్మం, జుట్టుకు అద్భుతమైన ఔషధం. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన మార్క్స్‌ను తొలగించడానికి చాలా సహాయపడుతుంది. గుడ్డులోని తెల్లసొనను బాగా గిలకొట్టి మార్క్స్ ఉన్న చోట రాయండి. కొద్దిరోజుల తర్వాత మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం
నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు, చర్మం రెండింటికీ అద్భుతమైనది. ఇది సాగిన గుర్తులను తొలగించి, చర్మానికి మంచి మెరుపును అందించడంలో సహాయపడుతుంది. మార్క్స్ ఉన్న చోట నిమ్మరసం రాయండి. నిమ్మరసంతో పాటు దోసకాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఆముదం, తేనె, పాల మీగడ వంటివి కూడా మార్క్స్‌ను తొలగిస్తాయి.