calender_icon.png 21 January, 2026 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి తరానికి తెలియాలి

18-09-2024 12:00:00 AM

గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): నిజాం వ్యతిరేక పోరాటంలో అప్పటి ఉద్యమకారులు, పౌరులు పడిన బాధలు, కష్టాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని హర్యానా రాష్ర్ట గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. మంగళవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన పులమాల వేసి నివాళి అర్పించారు. 76 ఏండ్ల విమోచన వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. 1947, ఆగస్టు15 దేశానికి స్వాతంత్య్రం రాగా హైదరాబాద్ రాష్ట్ర ఆధీనంలో ఉన్న తెలంగాణ, మరాట్వాడ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం 1948, సెప్టెంబర్ 17న స్వేచ్ఛ లభించిందన్నారు. విమోచనం కోసం ప్రజలు చేసిన ఉద్యమం చరిత్రాత్మకమన్నారు.