17 March, 2026 | 1:33 AM

పీపుల్స్‌మార్చ్‌కు పాదయాత్ర నేటికి మూడేళ్లు

17-03-2026 12:09 AM

ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.

ఎర్రుపాలెం మార్చి 16 (విజయ క్రాంతి): నాటి సిఎల్పీ నేత,నేటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ  భట్టి విక్రమార్క మల్లు  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పిప్పిరి గ్రామంలో నాడు వేసిన తొలి అడుగు, 

నియంత కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుండి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సంబరాలను ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు కేక్ కట్ చేశారు.

అనతరం స్వీట్లు పంపిణి చేసి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  మండల ఉపాధ్యక్షుడు శీలం శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనుమోలు వెంకట క్రిష్ణారావు, పంబి సాంబ శివరావు, కిసాన్ సెల్ అధ్యక్షులు తలపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.