calender_icon.png 12 December, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పల్లె ‘పోరు’

11-12-2025 12:00:00 AM

  1. భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 
  2. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు, పకడ్బందీగా ఏర్పాట్లు 
  3. ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ఎన్నికల నిర్వహణకు చర్యలు
  4. తొలివిడతలో ఓటేయనున్న ఏడు మండలాల ప్రజలు 
  5. 159 జీపీలు, 1097 వార్డుల్లో ఎన్నికలు
  6. ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు
  7. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

మణుగూరు, డిసెంబర్ 10 (విజయక్రాం తి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో జరగనున్న ఎన్నికలకు జిల్లా అధికారులు సిద్ధం అయ్యారు. పోలింగ్ నిర్వ హణకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

జిల్లాలోని ఏడు మండలాల్లో మొదటి దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. భద్రాచలం నియోజక వర్గంలోని భద్రాచలం, చర్ల, పినపాక నియోజకవర్గంలో బూ ర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలపై విజయక్రాంతి కథనం..

పారదర్శకం, పకడ్బందీగా ఏర్పాట్లు.. 

జిల్లాలో మొదటి విడతలో 159 గ్రామ పం చాయతీలకు గాను 14 సర్పంచ్ స్థానాల కు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.మిగిలిన 145 సర్పంచ్ స్థానాలకు 461 మంది బరిలో ఉన్నారు. 1,436 వార్డులకు గాను 336 వా ర్డులు ఏకగ్రీవం కాగా, 1,097 వార్డులో 2,557 మంది బరిలో ఉన్నారు.

తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఆయా మండలాలలో 1,428 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,713 మంది పోలింగ్ ఆఫీసర్లు 2,2 95 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వ హించనున్నారు. 

ఒంటిగంట వరకే పోలింగ్,బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక..

ఈసారి పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతుంది. అప్పటివరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి సాయం త్రంలోగా ఫలితాలను ప్రకటిసా రు.ఆ త ర్వాత ఎన్ని కైన వార్డు సభ్యులు ఉపసర్పంచ్‌లను ఎన్నుకుంటారు.

అలాగే అసెంబ్లీ, పా ర్లమెంట్ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు ద్వారాకాకుండా , గ్రామపంచాయతీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. ఒక్కో పంచాయతీలో ఒక ఓటు సర్పంచ్కు, మరో ఓటు వార్డు సభ్యుడికి. ఇలా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్ల కు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థుల కు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి.

బ్యాలెట్ పత్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. మరోవైపు అధికారులు పంచాయతీ ఎన్నికలలో కూడా అధికారులు నోటాకు ప్రాధాన్యం కల్పించారు. బ్యాలెట్ పత్రం చివరలో నోటా గుర్తు ఉంటుంది. పై అభ్యర్థులు నచ్చకపోతే ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. ఒక్క బ్యాలెట్ పేపర్లో ఎనిమిది గుర్తులతో పాటు చివర లో నోటా గుర్తుకు స్థానం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య దాటితే మరోబ్యాలెట్ పేపర్ జతచేస్తారు. అంటే ఎక్కడైనా ఎనిమిది మందికి మించి బరిలో ఉంటే అదనపు బ్యాలెట్ విని యోగిస్తారు.

పోలింగ్ సామగ్రి పంపిణీ, ప్రతిష్టమైన భద్రతా ఏర్పాట్లు..

పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని మండల కేంద్రలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి గ్రామ పంచాయ తీలకు సామగ్రిని వాహనాల ద్వారా తర లించారు. పోలింగ్ సిబ్బంది సైతం వారికి కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లాలో పోలీసులు పటి ష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,700 మంది పోలీసులతో భద్రత చర్యలను చేపట్టారు.1,510 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాల ఫై ప్రత్యేక నిఘాతో పర్యవేక్షిస్తున్నారు.  పోలింగ్ కేంద్రాల వద్ద రక్షణ చర్యల కోసం స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు నిర్వ హిస్తున్నారు.