14 July, 2026 | 7:34 AM

నీటి పొదుపే నేటి కర్తవ్యం

09-06-2024 02:32 AM
  • భవిష్యత్ తరాల కోసం నీటి పొదుపు అవసరం

ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని ఒడిసిపడదాం

హైదరాబాద్‌లో భూగర్భ జలాలను పరిరక్షిద్దాం

12.25మీటర్ల లోతుకు పడిపోయిన జలాలు

జలమండలి ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు

భూమిపై ప్రాణకోటికి జలమే ప్రధాన జీవనాధారం. నీరు లేకుండా కనీస అవసరాలను తీర్చుకోవడం కష్టం. ఇలాంటి పరిస్థితిని ఇటీవల ఐటీ సిటీ బెంగుళూరు కళ్లారా చూసింది. హైదరాబాద్ మహానగరంలోనూ అలాంటి పరిస్థితులు వస్తాయే మోనని వేసవి ప్రారంభంలో నగర వాసులు భయపడ్డారు. అదృష్టవశాత్తు అలాంటి కరు వు పరిస్థితులు రాకపోయినప్పటికీ హైదరాబాద్ జలమండలి చర్యలు కూడా నగర ప్రజలను మంచి నీటి కష్టాల నుంచి తప్పించాయి. కానీ మార్చి నుంచి ఏప్రిల్ వరకు నగరంలో నీటి సమస్య తలెత్తిందనేది వాస్తవం, మూడు నెలల్లో 5.48లక్షల వాటర్ ట్యాంకర్లను జలమండలి ద్వారా సప్లు కావడమే సమస్య ఉందనడానికి నిదర్శనం. నగరంలో నల్లా నీటితో పాటు బోరు నీళ్లపై ఆధారపడే వారి సంఖ్య ఎక్కువే. 

 హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8 (విజయక్రాంతి): నగరంలో దాదాపు 1.40కోట్ల జనాభా ఉంటుంది. ఆ జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని అందించడానికి హైదరా బాద్ జలమండలి మహాయజ్ఞమే చేస్తోంది. కానీ వేసవి వచ్చిందంటే నీటి సమస్య పునరావృతం అవుతోంది. దాన్ని అధిగమిం చాలంటే ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంతలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు, నిర్మాణానికి బాధ్యతతో ముందుకు సాగాలని నగర ప్రజలను జలమండలి, జీహెచ్‌ఎంసీ, భూగర్భ జలాల శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నగర ప్రజలను కోరుతున్నారు. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం రాబోతున్నందున వర్షం నీటిని ఒడిసి పట్టి మన భవిష్యత్ అవసరాలను తీర్చుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసం ఉంది.

ఇంకుడు గుంతలతోనే పరిష్కారం

నగరంలో దాదాపు 23 లక్షల ఇళ్లు, 17లక్షల పైగా బోర్లు ఉన్నాయి. నగర వాసులు నల్లా నీటితో పాటు బోర్లపై ఆధారపడి నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. రోజురోజుకు జరుగుతున్న నగర విస్తరణ, జరుగు తున్న అభివృద్ధి పనుల కారణంగా నేలపై కాంక్రీట్ పరిణామం పెరుగుతోంది. కారణం గా వర్షం నీళ్లు భూమిలోకి ఇంకలేక పోతున్నాయి. దీంతో వేసవి నాటికి బోర్లు ఎండి పోతున్నాయి.  హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. 2023 మేలో 10మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2024మే నాటికి 12.25మీటర్ల లోతుకు పడిపోయాయి. కారణంగా వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. కారణంగా గతంలో 150ఫీట్లు ఉండే బోర్లు ప్రస్తుతం 1500ఫీట్ల లోతువరకు వేస్తున్నా రు. ప్రస్తుతానికి నగర వాసుల నీటి అవసరాలు తీరినప్పటికీ భవిష్యత్ తరాలకు జలగండం పొంచి ఉందనేది వాస్తవం, ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, గచ్చిబౌళి, మణికొండ, షేక్‌పేట సహా నగరంలోని 25కు పైగా ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది.అయితే ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించడం, ఉన్న ఇం కుడు గుంతలను పునరుద్దరించడంతో ఈ గండం నుంచి గట్టెక్కొచ్చని అధికారులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అందుకోసం షాఫ్ట్(ఇంజక్షన్‌వెల్)కాంటూర్ బండ్స్, చెక్‌డ్యామ్స్, కాంటూర్‌ట్రెంచెస్, ఫాంపాండ్స్

బాధ్యతగా నిర్వహించాలి

2000సంవత్సరంలో తీసుకువచ్చిన జీవో ప్రకారం నగరంలోని 300చదరపు మీటర్ల ఇంటి నిర్మాణం చేపట్టేటపుడు, అనంతరం వచ్చిన వాల్టా చట్టం ప్రకారం 200చదరపు మీటర్ల విస్తీర్ణంగల ఇళ్ల నిర్మాణం చేపట్టేటపుడే ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను నిర్మించుకో వాలి. అలా ఉంటేనే జీహెచ్‌ఎంసీ ఇళ్ల నిర్మాణానికి, నల్లా కనెక్షన్ కోసం జలమండలి   అనుమతిస్తోంది. కానీ పలువురు ఇంకుడు గుంతల నిర్మాణాల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. పలు ఇళ్లలో నిర్మించుకున్న ఇంకుడు గుంతలను నిర్వహణపై దృష్టి సారించడంలేదు. ఇలా చేయడం వల్ల వర్షం నీరు భూమిలోకి పోకుండా వృథాగా నాలాల్లో కలిసి పోతోంది. కారణంగా కొంత మేరకే భూమిలోకి ఇంకుతోంది. కాబట్టి ప్రతి ఇంట్లో సామాజిక బాధ్యతతో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి.

కబ్జాలు కారణమే

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ సహా పలు చెరువులలోకి వర్షం నీరు చేరడం వల్ల భూమిలోకి వర్షం నీరు ఇంకేది. కానీ రానురాను చెరువులు కబ్జాలకు గురి కావడం కూడా భూగర్భ జలాలు తక్కువ కావడానికి కారణమవుతోందని విమర్శిస్తున్నారు.