23-08-2025 12:30:17 AM
పోలీసులకు లభించిన సూసైడ్ నోట్
లక్నో, ఆగస్టు 22: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి(18) ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించింది. ‘ఆన్‌లైన్ గేమ్స్‌పై ఇష్టం వల్ల చదువులో సరిగ్గా రాణించలేకపోతున్నా. మీరందరూ నా గేమింగ్ వల్ల బాధపడ్డారు.
ఆన్‌లైన్ గేమ్స్ వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయా. నా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టా’ అని అందులో ఉంది. లక్నోలోని గోమతినగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో ఉంటున్న 12వ తరగతి విద్యార్థి గది లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించా డు. పోలీసులు సంఘటనా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.