18-08-2024 12:21:16 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : నగరాన్ని గంజాయి, డ్రగ్స్ ఫ్రీగా మార్చాలనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ చేపట్టిన ఆపరరేషన్ ధూల్‌పేట్ సత్ఫలితాలి స్తోంది. ఎక్సైజ్ శాఖకు తోడు పోలీసులు కూడా తోడవడంతో నగరంలోని గంజాయి విక్రేతలు, వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నెల రోజులుగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన దాడు ల్లో 27కేసుల్లో 72మందిని అరెస్ట్ చేసి, 14 వాహనాలను సీజ్ చేశారు. మరో 28మందిని బైండోవర్ చేశారు. దీంతో అప్రమ త్తమై న పలువురు గంజాయి వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్ లావాదేవీలపై నిఘా !
గంజాయి విక్రేతలు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడుతుండటంతో వారు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఫోన్లలోనే ఆర్డర్ తీసుకుని గంజాయిని నేరుగా డెలివరీ చేస్తున్నారు. దీంతో గంజాయి కోసం ధూల్‌పేట్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలోనే ఎక్సైజ్, పోలీసులు.. ధూల్‌పేట్‌లోని గంజాయి విక్రేతల.. ఫోన్‌లను స్వాధీనం చేసుకొని వారి ఫోన్‌పే, గూగుల్‌పే, ఇతర యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరిపిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
దాడులు యథాతథం ?
ఆగస్టు 31 నాటికి ధూల్‌పేట్‌ను గంజాయి ఫ్రీగా మార్చుతామని ఎక్సైజ్ అధికారులు పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి అంతా సర్ధుకుంటుందని పలువురు గంజాయి విక్రేతలు భావిస్తున్నారు. అయితే నగరాన్ని గంజాయి ఫ్రీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున.. ఆగస్టు తర్వాత కూడా గంజాయి విక్రేతలు, వినియోగదారులపై దాడులు యథాతథంగా కొనసాగుతాయని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
గంజాయి పట్టివేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ధూల్‌పేట్‌లో శనివారం ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 1.6కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న సుశీల్ సింగ్, రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిం దితులు వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఆర్డర్ తీసుకుని గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నం ద్యాల అంజిరెడ్డి తెలిపారు. సుశీల్ సింగ్ కు సహకరిస్తున్న ప్రతిభాసింగ్, మరో వ్యాపారి పరారీలో ఉన్నట్లు సమాచారం.
ధూల్‌పేట్‌లో గంజాయిని అరికడతాం
ఆగస్టు నెలాఖరులోపు గంజాయి ని ర్మూలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి అన్నారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో శనివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.