calender_icon.png 21 January, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ విలీనంలో బీజేపీ పాత్ర శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు

18-09-2024 12:52:24 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ విలీనంలో బీజేపీ పాత్ర శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఎగరేశారు. మహేశ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేసే బాధ్యతలను అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్‌కు నెహ్రూ అప్పగించారని గుర్తుచేశారు. హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్,  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.