12-05-2025 04:50:58 PM
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య
కొత్తగూడెం,(విజయక్రాంతి): ఈనెల 20వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జమలయ, కార్యదర్శి గెద్దాడి నగేష్ లు పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెంలోనే ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సమ్మె పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్ర ప్రయోజనాలను కల్పించాలని, అసంఘటితరంగా కార్మికులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, హమాలి కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు వెలిశాల బీ రమణయ్య, అల్లిముత్యం పురస్సాటి సారయ్య, గాజుల వెంకటేశ్వర్లు, సైన్యము జగన్, తుసేటి కొమరయ్య, ఎచ్చే దామోదర్ పాల్గొన్నారు.