25-07-2025 11:35:05 PM
మంగపేట,(విజయక్రాంతి): మండలంలోని బుచ్చంపేట గ్రామ శివారులో పొలంలో దమ్ము(దున్నుతుండగా) చేస్తుండగా అకస్మాత్తుగా మూర్ఛ (పిడుసు) రావడంతో ట్రాక్టర్ డ్రైవర్ దీకొండ శేషు ట్రాక్టర్ నుండి క్రింద కాలువలో ట్రాక్టర్ తో సహా పడడంతో దమ్ము చక్రాల కింద ఇరుక్కొని ఊపిరి ఆడక మృతి చెందాడు మృతుడి అన్న ధీకొండ నవీన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన రాసకొండ మల్లయ్య వ్యవసాయ పొలంలో శుక్రవారం ఉదయం ట్రాక్టర్ తో దమ్ము చేస్తుండగా ఒక్కసారిగా మూర్ఛ రావడంతో ఈ సంఘటన జరిగింది. మృతుని అన్నా ధీకొండ నవీన్ పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.