26-07-2025 12:00:00 AM
గద్వాల, జూలై 25 ( విజయక్రాంతి ) : భారత్ మాల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అవుతున్నా పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం గట్టు మండలం గంగిమాన్ దొడ్డి రైతులు నిరసన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ మాల రో డ్డు నిర్మాణానికి సేకరించిన భూములకు వెం టనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు రహదారి నిర్మాణ పనులను అడ్డుకొని రాస్తారోకో చేపట్టారు.
పరిహారం చెల్లిం పులో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. గతంలో పరిహారం విషయంపై కలెక్ట ర్ను కలిసిన ఇప్పటి వరకు నిర్వాహకులు చెల్లింపులు జాప్యం చేస్తున్నారని ఆరోపించా రు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. జిల్లా కలెక్టర్ తో పోన్ లో మా ట్లాడించడంతో నిరసనవిరమించారు.