24-10-2025 11:28:53 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలోని బంధం వాగు, తిమ్మాపురం- కోడూరు గ్రామాల మధ్య ఉన్న వంతెన, నూతనకల్ వెళ్లే రోడ్డు వర్షాల కారణంగా తెగిపోవడంతో గత 4 నెలలుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మధ్యకాలంలో పిడిఎస్ బియ్యం ట్రాక్టర్ కూడా నీటి ప్రవాహంలో పడి ఇబ్బందులు పడ్డారు. సంగెం గ్రామ ప్రజలు, విద్యార్థులు, రైతులు పాఠశాలలు, పనులకు వెళ్లాలంటే, తుంగతుర్తి చుట్టూ తిరుగుతూ, నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్ తక్షణమే స్పందించి , బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతంగా సాగుటకు కృషి చేయాలని, గ్రామస్థులు కోరుతున్నారు.