calender_icon.png 25 October, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ బియ్యం బొక్కేశారు

25-10-2025 12:00:00 AM

- తవ్విన కొద్ది అక్రమాల వెల్లడి 

-మిల్లర్ల వద్దే 23.503 మెట్రిక్ టన్నుల ధాన్యం

- విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులతో బహిర్గతం

- చోద్యం చూస్తున్న సివిల్ సప్లై అధికారులు

- జరిమానాతో చెల్లించాలంటున్న అధికారులు

గద్వాల్ అక్టోబర్ 24 : జోగులాంబ గద్వాల జిల్లాలో సిఎంఆర్ పేరిట కొందరు బిల్డర్లు అక్రమ దందా పాల్పడుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్య వహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ప్ర భుత్వం కోట్ల విలువ చేసే దాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి మరాడించి ఇవ్వాలని ఆదే శిస్తే తిరిగి బియ్యం ఇవ్వడంలో మిల్లర్లు జా ప్యం వహిస్తున్న అడిగే నాథుడే కరువయ్యాడు. మిల్లర్లు కొందరు సివిల్ సప్లై అధి కారులకు సాయంతో కోట్ల విలువ చేసే ధా న్యాన్ని బయట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కార్ కి అందించాల్సిన బియ్యాన్ని మిల్ల ర్లు పక్కదారి పడుతున్న పట్టింపు కరువైంది. అధికారులు ఒత్తిడి చేసిన సమయంలో డీల ర్ల వద్ద పిడిఎస్ బియ్యం ను మిల్లర్లు కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభు త్వానికి ఇస్తున్నారు ఇది తెలిసిన అధికారులు మిల్లర్లకు ఇచ్చే లంచాలకు ఆశపడి వాటిని పాస్ చేస్తున్నారు.

దీనికిగాను ఈ మధ్యనే మి ల్లర్ల మాయాజాలం బయటపడుతున్నది గద్వాలలో గత వారం రోజుల క్రితం విజిలె న్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులతో బట్టబయలైంది 2022_ 23 సంవ త్సరములో కేటాయించిన యాసంగి ధాన్యా న్ని మెజార్టీ మిల్లర్లు విక్రయించేశారు ఇప్పటివరకు దాదాపు 23, 503 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉండాల్సి ఉండగా దా దాపుగా నిలువలన్నీ ఖాళీ చేసి కోట్ల రూపాయలు ఆదాయం పొంది దానితో వ్యాపా రం చేస్తున్నారు ఇన్నేళ్లుగా వారివద్దే ధాన్యం ఉన్న సివిల్ సప్లై అధికారులు వాటిపై పర్యవేక్షించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డీ టీలు ఇచ్చే నివేదికలను మూలన పెట్టి మిల్లర్లతో గత అధికారి ప్రస్తుతం ఉన్న అధికారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా యి.

గతంలో కేటి దొడ్డి మండలం నందిన్నెలోని కమ్మిడి స్వామి రైస్ మిల్లుకు సివిల్ స ప్లై అధికారులు 2022 యాసంగిలో 14 25. 520 మెట్రిక్ టన్నుల ధాన్యం 2024 వాన కాలంలో 5848 మెట్రిక్ టన్నులు 2024 _25 అసెంబ్లీలో పదివేల294 మెట్రిక్ అన్న దాన్ని కేటాయించారు దీని విలువ సుమారు 45 కోట్లు ఉంటుందని అధికారులు అంచన వేశారు అయితే ప్రభుత్వానికి బియ్యాన్ని సక్రమంగా అందించలేకపోవడంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో మిల్లు లో ఆగస్టులో విజిలెన్స్ అధికారులు సోదా చేశారు. సుమారు 7 కోట్ల పైననే విలువైన ధాన్యాన్ని స్వాహా చేసినట్లు నివేదిక ఇచ్చారు దీని ఆధారంగా మిల్లు యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చేతు లు దులుపుకున్నారు. మిల్లు యజమానికి ఆర్‌ఆర్ ఆక్ట్ కింద విజిలెన్స్ అధికారులు నో టీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అయితే సదురు మిల్లు యజమా ని రాష్ట్రస్థాయిలో ఉండే ఓ ప్రజా ప్రతినిధి కాపాడినట్లు తెలిసింది. 

కేవలం జిల్లా రైస్ మిల్లులపై రాష్ట్రస్థాయి విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన ప్రతిసారి అక్రమాలు బయటపడుతూనే ఉన్నా యి. ఇలా ప్రతిసారి సివిల్ సప్లై అధికారులు కేసులతో సరిపెడుతున్నారే తప్ప అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ఎటువంటి చర్య తీ సుకపోగా మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. గద్వాల పట్టణంలోని డ్యాం కు వెళ్లే దారిలో ఉండే శ్రీరామ రైస్ మిల్లును ఈనెల 18న హైదరాబాద్ నుండి వచ్చిన విజిలెన్స్ అధికారులు దాడి చేశారు ఈ క్రమంలో శ్రీరామ మిల్లు కు 2022_ 23 వానకాలం యాసంగి 2024 _25 సీజనకు సంబంధించి 2. 25 కోట్ల విలువచేసే 26.240 సంచుల ధా న్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల విచారణలో తెలిసింది విలేజ్ వారు అందజేశారు అయితే ఇప్పటివరకు ఆ మిల్లు యజ మానిపై సివిల్ సప్లై అధికారులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రైస్ మి ల్లులోనే ఇంత అవినీతి జరిగినప్పుడు జిల్లా లో మొత్తం 33 రైస్ మిల్లులు ఉన్నాయి ఈ లెక్కన ఎంత అవినీతి జరిగిందో తెలుసుకోవచ్చు దీని వెనక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదా అని ఆరోపణ వినిపిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ మిల్లు నుంచి రాత్రి వేళలో ధాన్యం లారిలో తరలిస్తున్న విషయాన్ని కొందరికి యువకులు గమనించి వందకు డయల్ చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులు తీరా మిల్లు యజమానికే వత్తాసు పలికి యువకులు తీసిన ఫోటోలు డిలీట్ చేయించినట్లు తెలిసింది మరో మిల్లు యజమాని సివిల్ సప్లై అధికారులకు కేటాయించిన ధాన్యం బయట విక్రయించి రాయచూర్ నుండి రెండో పాలిటి బియ్యాన్ని తెచ్చి ప్రభుత్వానికి సరిపడా చేసినట్లుగా తెలిసింది ఈ విషయం జిల్లా సివిల్ సప్లై అధికారులకు తెలిసిన ప ట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి జిల్లా కేంద్రాన్ని సమీపంలో మిల్లు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యాపారులు ప్రభుత్వం కేటాయించి న ధాన్యాన్ని బయట విక్రయించినట్లు తెలిసింది ఈ మిల్లు పై విజిలెన్స్ అధికారులు దృష్టి పెడితే మరి కొంతమంది మిల్లర్ల అక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపో లేదని ప్రజలు అనుకుంటున్నారు.

రైసు మిల్లర్లది ఇంకో వాదన......

ఈ విషయం ఇలా ఉంటే రైస్ మిల్లర్ల వాదన ఇంకోరకంగా వినిపిస్తున్నారు. 2021 _22 ధాన్యం విషయంలో అప్పుడు అకాల వర్షాలు రావడం వల్ల ధాన్యం మొత్తం తడిసిపోయిందని మిల్లు ఆడించిన బియ్యం పని కిరావని అప్పటి ప్రభుత్వం బియ్యం బాగా లేవని టెండర్స్ ద్వారా అమ్మేస్తామని ముగ్గు రు బిడ్డర్స్ కి ఇవ్వడం వలన తడిసిన ధాన్యా న్ని తీసుకొని తీరా మిల్లుల దగ్గరకు వచ్చి చూస్తే బియ్యం మొక్కిపోయనేని రెండు సం వత్సరాలుగా నిల్వలు ఉన్నాయని మేము తీ సుకోము అని చెప్పి వెళ్లిపోయారని రెండు మూడుసార్లు బిడ్డర్స్ కి డిఫాల్ట్ కాకుండా చేసి చివరికి మూడోసారి డిఫాల్ట్ చేశారు. మ న దగ్గరనే కాకుండా రాష్ట్ర మొత్తం మీద ని ల్వలు ఉన్నాయని ఇప్పటికీ కూడా ఉన్నాయని పూర్తిగా డామేజ్ ఎక్కిన వాసన వస్తు న్నాయని తెలిపారు.

 అంతు చిక్కని సమాధానం

జిల్లాలో 2021_ 22 సంబంధించి ఇన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నప్పటికీ ఎందుకు సివిల్ సప్లై అధికారులు గానీ ప్ర భుత్వం గానీ పట్టించుకోవడం లేదు. తడిసిన ధాన్యాన్ని మాకు ఇవ్వడం వలన టెండర్ వేసిన వారు తీసుకోకపోయినప్పటికీ ప్రభు త్వం ఈ మక్కిన ధాన్యాన్ని తిరిగి ఎందుకు తీసుకోలేదు అనేది చిక్కుముడి ఏది ఏమైనాప్పటికీ ఇప్పటికీ కూడా చాలా రైస్ మిల్లులో బియ్యం ఉన్నాయని మక్కిన బియ్యం ఉన్నాయని తెలుస్తుంది దీనిపైన అధికారులు చర్య లు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.

సమాధానం చెప్పకుండా దాట వేస్తున్న అధికారి

సి ఏం ఆర్ బియ్యం విషయం లో జిల్లా లో జరుగుతున్న అవినీతి అక్రమాల విష యం లో సంబందించిన అధికారి కి వివరణ కోరితే ఎలాంటి సమాధానం చెప్పకుండా దాట వేయడం పలు అనుమానాలకి దారితీస్తున్నాయి.