calender_icon.png 30 January, 2026 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి

30-01-2026 08:03:08 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పురపాలక ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే అభ్యర్థులను సిపిఎం పార్టీ నిలబెట్టిందని, వారిని గెలిపించి ప్రశ్నించే గొంతులను మున్సిపాలిటీ పాలకవర్గంలోకి పంపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం దినకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, లౌకిక భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, శాఖ కార్యదర్శి దుర్గం నిఖిల్, నాయకులు వడ్లూరి మల్లేష్‌ పాల్గొన్నారు.