16 April, 2026 | 4:37 AM

భద్రాద్రిలో స్తంభించిన ట్రాఫిక్

07-04-2025 12:00 AM

ట్రాఫిక్ లో చిక్కుకొని గంటలు తరబడి నిరీక్షించిన వాహనదారులు 

భద్రాచలం ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): భద్రాచలం లో ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణానికి దేశం నలుమూలల నుండి వివిధ వాహనాల ద్వారా లక్షలాది మంది భక్తులు భద్రాచలం చేరుకొని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారు. కళ్యాణం అనంతరం తిరిగి వారి గమ్యస్థానానికి వెళ్ళటానికి వారి వారి వాహనాలతో తిరుగు ప్రయా ణం అవ్వగా భద్రాచలం రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి వెళ్లడానికి దారి లేకుండా పోయింది.

ముఖ్యంగా దేవాలయ పరిసరాలలో ఉన్న వీధులన్నీ భక్తులు వాహనాలతోనే నిండిపోయాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లడానికి ప్రజలు యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా కళ్యాణం అయిపోగానే తిరిగి వారి గమ్యస్థానాలకి వెళ్లడానికి భక్తులు వారి వాహనాలలో తిరిగి ప్రయాణం అవ్వటం, ఒక్కసారిగా వందలాది వాహనాలు రోడ్లు ఎక్కడంతో పట్నంలోని బ్రిడ్జి రోడ్, ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు, చర్ల రోడ్ అంబేద్కర్ సెంటర్ రోడ్లలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర సమస్య ఏర్పడింది.

అందరూ బ్రిడ్జి దాటి బయటకు వెళ్లాల్సి రావటంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా బ్రిడ్జి దాటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గంటల తరబడి వాహనాలు లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు కష్టపడి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంలో పోలీసులు సఫలీకృతులు అవటంతో వాహనదారులు ఒకసారి గా ఊపిరి పీల్చుకొని వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. భద్రాచలం పట్టణంలోని ప్రధాని రోడ్డుపైనే ట్రాఫిక్ సిబ్బందిని పెట్టి,  మిగతా పట్టణంలో ట్రాఫిక్ సిబ్బంది  నియమిం చకపోవడంతో ఆదివారం నాడు పట్టణవాసులు వారి ఇళ్లకు  వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.